కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకొనే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. కొడుకు చేసిన నేరానికి తండ్రిని శిక్షించలేమని బీజేపీ అధిష్ఠానం పేర్కొన్నట్లు సమాచారం. లఖింపూర్ ఖేరి రైతులపై వాహనం నడిపిన కేసులో అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రాపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలి లేదా అతడిని బర్తరఫ్ చేయాలని ఇరు సభల్లో ప్రతిపక్షాలు డిమాండు చేశాయి.
అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనేందుకు బీజేపీ సీనియర్ నాయకత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని కేంద్ర క్యాబినేట్ నుంచి తొలగించే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. లఖింపూర్ ఖేరి కేసుల ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నది. స్పెసల్ ఇన్వెస్టిగేషన్ టీం తన తుది నివేదికను సమర్పించాల్సి ఉన్నది.