బ్రేకింగ్ : హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌

చైనాలో పురుడు పోసుకున్న క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న దేశాన్ని అస్స‌లు వ‌దిలేలా లేదు. ఇప్ప‌టి కే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. చాలా ఇండియాలోని చాలా రాష్ట్రల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ముంచేసింది ఈ మ‌హ‌మ్మారి. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి బారీన చాలా మంది న‌టీ, న‌టులు ప‌డ్డారు. ఇక తాజాగా త‌మిళ్ స్టార్ హీరో… విక్ర‌మ్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

ఇవాళ నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌లలో… పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. అయితే.. ఇది ఓమిక్రాన్ వేరియంట్ కాదా అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టు ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ మ‌ధ్య కాలంలో త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారు క‌చ్చితంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విక్ర‌మ్ కోరారు. కాగా.. హీరో విక్ర‌మ్‌ ఇటీవల తన రాబోయే చిత్రం కోబ్రా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక అటు యాక్ష‌న్ హీరో అర్జున్ కు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే.