ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్ర ప్రజలకు మరో 6 నెలల పాటు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి తోడు గా ఓమిక్రాన్ వేరియంట్ భయం ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదని అన్నారు. అందుకోసమే ఉచిత రేషన్ పథకాన్ని తమ రాష్ట్రంలో మరో ఆరు నెలలు పొడిగిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
కరోనా, ఓమిక్రాన్ వేరియంట్ లపై ప్రజలు ఎవరూ కూడా భయాందోళన చేందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలను క్రమం తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. అలాగే రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోస్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగ ఇప్పటి వరకు ఢిల్లీ లో 26 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.