ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం రద్దు అయింది. ప్రతీ ఏడాది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివ్రుద్దికి కీలకమైన సమావేశం ప్రస్తుతం ఓమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈసారి 2022 జనవరి 17-21 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు దావోస్-క్లోస్టర్స్‌లో జరగాల్సి ఉంది. కాగా ఓమిక్రాన్ , కోవిడ్ కారణంగా ఈ సమావేశాలను 2022 వేసవి ప్రారంభంలో ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఓమిక్రాన్ వేరియంట్ యూరోపియన్ దేశాల్లో తీవ్రంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా యూకే, డెన్మార్క్, నార్వే దేశాలో ఓమిక్రాన్ తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. యూకేలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 30వేలను దాటి పోయింది. మరోవైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే స్విట్జర్లాండ్ లో కూడా కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రపంచ స్థాయి నేతలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది కనుక ఓమిక్రాన్ ద్రుష్టిలో పెట్టుకుని సమావేశాలను రద్దు చేశారు.