దేశంలో ఓమిక్రాన్ భయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో ప్రభుత్వాలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో కేసుల సంఖ్య 160ని దాటింది. గడిచిన రెండు మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. ఇదిలా ఉంటే గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్ మస్, న్యూ ఇయర్ వేడుకను దృష్టి ఉంచుకుని నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లోని ఎనిమిది నగరాల్లో నైట్ కర్య్ఫూ విధించేందుకు సిద్దమైంది. వచ్చే పండగలను దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండకుండా నైట్ కర్య్ఫూను అమలు చేయనున్నారు.
డిసెంబరు 20 నుంచి 31 వరకు అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్కోట్, వడోదర, భావ్నగర్, జామ్నగర్ మరియు జునాఘర్లలో రాత్రి 1 నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ నగరాల్లోని రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు 75 శాతం సిట్టింగ్ కెపాసిటీతో పనిచేయడానికి, సినిమా హాళ్లు 100 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించారు. ఇప్పటికే గుజరాత్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 11 కుచేరింది.