ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు… ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు వందకుపైగా నమోదవుతున్నాయి మహమ్మారి కేసులు… రెండు రోజుల నుంచి 100 లోపు ఏ నమోదు కావడం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా…. కృష్ణాజిల్లాలో ఒకరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 179 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే గడిచిన 24 గంటల్లో 27 వేల 233 కరోనా పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ చేయగా వాటి మొత్తం సంఖ్య మూడు కోట్ల పది లక్షల పైగా చేరింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,432 చేరింది. ఇక కరోనా కారణంగా ఇప్పటివరకు 14481 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడేవారి సంఖ్య 20 లక్షల 75 వేలకు పైగా చేరగా కోల్పోతున్న వారి సంఖ్య 20 లక్షల 60 వేలకు చేరుకుంది.
#COVIDUpdates: 21/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,079 పాజిటివ్ కేసు లకు గాను
*20,57,166 మంది డిశ్చార్జ్ కాగా
*14,481 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,432#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RKLRvYLw1q— ArogyaAndhra (@ArogyaAndhra) December 21, 2021