ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యం గా యూకే లో పెను విధ్యంసాన్ని సృష్టిస్తుంది. బుధవారం ఒక్క రోజే యూకే లో 1,06,122 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం మంది కరోనా నివారణ వ్యాక్సిన్ లు తీసుకున్న వారే అని యూకే అధికారక వర్గాలు తెలిపాయి. అలాగే యూకే లో బ్రిటన్ లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 1,47,573 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.
అంతే కాకుండా 11 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకింది. భవిష్యత్తు లో ఓమిక్రాన్ వేరియంట్ ఇంకా విస్తరించే అవకాశం ఉందని యూ కే అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజలు అందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నాయి. బూస్టర్ డోసు తోనే ఓమిక్రాన్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్న పిల్లలకు కూడా ఫైజర్స్ టీకా వేయడానికి బ్రిటీష్ రెగ్యూలేటర్స్ అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో వారికి కూడా టీకాల పంపిణీ ఉంటుందని తెలిపారు.