సంక్రాంతికి ఊరెల్లిపోతాం మామా అనుకునేవాళ్లకు అలర్ట్…!

పండగలు పబ్బాలు వచ్చాయంటే సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఇంటి బాట పడుతూ ఉంటారు. ముఖ్యంగా పండగల సీజన్ వచ్చింది అంతే చాలు సొంతూళ్ళకు వెళ్లే వారికి కష్టాలు మొదలు అవుతాయి. ఏ బస్సు ఎక్కినా కిక్కిరిసిపోయే జనాలు ఉంటారు. ఇక సంక్రాంతి పండగకు కూడా పరిస్థితులు అలాగే ఉంటాయట. పండగకు 20 రోజులు వుండగానే ఇప్పటికే జనవరి 7-14 మధ్యన రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ బుక్ అయిపోయాయట.

ఇక హైదరబాద్ మరియు విజయవాడ నుండి వైజాగ్ వెళ్లే రైళ్లకు బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండగా రైళ్లలో అయితే వెయిటింగ్ లిస్టు దాటిపోయి రిగ్రెట్ వస్తుందట. అయితే హైదరాబాద్ కు వెళ్ళే రైళ్లలో మాత్రం బెర్తులు కాళిగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో స్పెషల్ రైళ్లు వేస్తారా అని ప్రయాణికులు ఆశిస్తున్నారు..దీనిపై రైల్వేశాఖ, ఆర్టీసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.