TATA NEXON EV: బిగ్ బ్యాటరీతో టాటా నెక్సాన్ ఈవీ… ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కి.మీ…

-

ఇండియాలో రానున్న కొన్ని ఏళ్లలో ఎలక్ట్రానిక్ వెహికిల్ విప్లవం రాబోతోంది. అందుకు తగ్గట్లుగానే వినియోగదారులు ఈవీ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడం కూడా వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎలక్ట్రానిక్ కారుగా ’టాటా నెక్సాన్ ఈవీ‘ పేరు తెచ్చుకుంది. ఈ మోడల్ ను టాటా సంస్థ బయటకు తెచ్చిన వెంటనే కార్ల సేలింగ్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని ఎక్ట్రానిక్ కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు నెక్సాన్ ఈవీనే. 30.2kWh బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 312 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని టాటా కంపెనీ చెబుతోంది. 127 హార్స్ పవర్ తో 245 న్యూటన్ మీటర్ల టార్క్ ను జెనరేట్ చేసే మోటర్ ను నెక్సాన్ లో అమర్చారు. అయితే ప్రస్తుతం నెక్సాన్ ఈవీ నగరాల్లో, సమీప దూరాలు వెళ్లేందుకే అనువుగా ఉంటోంది. సగటున నెక్సాన్ ఈవీ 200 కిలోమీటర్ల వరకే రేంజ్ ఇస్తోంది.

అయితే ప్రస్తుతం మరింత పెద్ద బ్యాటరీతో కొత్త మోడల్ నెక్సాన్ ఈవీని తీసుకురావడానికి టాటా సంస్థ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 2022 తొలిభాగంలో కొత్తగా నెక్సాన్ ఈవీని మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 30.2 kWh స్థానంలో 40kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో 30 శాతం వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్లు అవుతుంది. దీంతో టాటా నెక్సాన్ ఈవీ రెంజ్ 300 కిలో మీటర్ల నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ కు పెరుగనుంది. దీని వల్ల ఎక్కువ దూరం ఉన్న ప్రయాణాలకు కూడా నెక్సాన్  ఈవీని ఉపయోగించే అవకాశాలు పెరుగుతాయి. అదనంగా బ్యాటరీ ప్యాక్ పెట్టడం వల్ల దాదాపుగా కార్ కెర్బ్ వేయిట్ లో 100 కిలోలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మరింత మంది నెక్సాన్ ఈవీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఇండియాలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కార్లలో నెక్సాన్ ఒకటి. దీని ధర పరిధి రూ. 14.24 లక్షల నుండి రూ. 16.85 లక్షలు( ఎక్స్ షోరూం) ఉంది. దీని పోటీదారులైన హ్యుందాయ్ కోనా, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ కార్లతో పోలిస్తే టాటా నెక్సాన్ కొనుగోళ్లు అధికంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news