ఒమీక్రాన్ ఎఫెక్ట్ : శిరిడి సాయిబాబా ఆలయం మూసివేత !

-

ఒమీక్రాన్  విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తూ.. మార్గదర్శకాలను విడుదల చేసింది. 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాత్రిపూట కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అలాగే ఐదుగురు కంటే ఎక్కువ మందికి గుమిగూడ వద్దని… కరోనా నిబంధనలను పాటించాలని సూచనలు చేసింది ప్రభుత్వం.

వివాహ వేడుకల్లో కేవలం 100 మంది మాత్రమే హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. 50% సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లకు అనుమతులు ఇచ్చింది. ఇక అటు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం షిరిడీలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరం మూసి వేస్తున్నట్లు సంస్థాన్ వెల్లడించింది. కర్ఫ్యూ సమయాల్లో సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నారు ఇట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈవో భాగ్యశ్రీ తెలిపారు. ఆలయం లోని అన్ని సౌకర్యాలు కూడా మూసివేస్తామని భక్తులు దీనిని దృష్టి లో ఉంచుకోవాలని సూచించింది సంస్థాన్.

Read more RELATED
Recommended to you

Latest news