సమంత క్రేజ్ తో మజిలీ బిజినెస్ అదుర్స్..!

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. చైతు సరసన సమంత నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దివ్యాన్ష కౌషిక్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. నిన్ను కోరి సినిమాతో ప్రతిభ చాటుకున్న శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా మజిలీ. నాగ చైతన్య, సమంత మ్యారేజ్ తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది.

సన్ షైన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్ అదిరిపోయేలా చేస్తుంది. పెళ్లి తర్వాత సమంత ఫుల్ ఫాంలో ఉంది. ఇక రీసెంట్ గా వచ్చిన మజిలీ టీజర్ కూడా ఆడియెన్స్ ను అలరించింది. అందుకే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి ఐదు కోట్లకు కొనేసింది. డిజిటల్ రైట్స్ కూడా అమేజాన్ ప్రైమ్ 3.5 కోట్లకు డీల్ సెట్ చేసుకుందట. హింది డబ్బింగ్ రైట్స్ మరో 4 కోట్లు పలికాయట. సో థియేట్రికల్ రైట్స్ కాకుండానే మజిలీ 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏప్రిల్ 5 రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news