తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో 1,913 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ లోనే 1,214 కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే తాజా గా కాసేపటి క్రితం కరోనా బులిటన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం మిగిలిన కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఇద్దరు కరోనా మహమ్మారి బారిన పడిన మృతి చెందారు.
అలాగే రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 232 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,520 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి తో పోల్చకుంటే దాదాపు 400 కేసులు పెరిగాయి. అయితే ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.