ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారనే వార్తలపై తాజా గా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా.. పార్టీని పెట్టుకునే హక్కు ఉందని వైఎస్ షర్మిల అన్నారు. అలాగే అధికారంలో ఎప్పుడు ఉంటానని అనుకోవడం ముర్ఖత్వమే అంటూ పరోక్ష విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నవారు ఎప్పుడు అక్కడే ఉండరని.. అధికారం లేని వారు ఎప్పుడు అలాగే ఉంటారని చెప్పలేమని అన్నారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదని అన్నారు. అయితే వైఎస్ షర్మిల చేసిన ఈ పరోక్ష విమర్శలు ఎవరిని ఉద్ధేశించి చేశారో అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది.
అయితే ఇటీవల ఏపీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తీ తగాధాలు వచ్చాయని వారి మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందనే వార్తలు ఎక్కువ గా వినిపిస్తున్నాయి. అలాగే క్రిస్మస్ పండుగ రోజున వీరి మధ్య వివాదం తారా స్థాయికి చేరిందని వార్తలు వచ్చాయి. దీంతో అన్న జగన్ పై మీద పోటీ చేయడానికి వైఎస్ షర్మిల సిద్ధం అవుతుందని, దాని కోసం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేకంగా ఒక పార్టీని కూడా స్థాపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా గా మరో సారి వైఎస్ షర్మిల ఇలా పరోక్ష విమర్శలు చేయడం వల్ల ఈ వార్తలు మరో సారి తెర పైకి వచ్చాయి.