బాహుబలి నటుడు “కట్టప్ప” కు కరోనా.. ఆస్పత్రి చేరిక

-

సీనియర్‌ యాక్టర్‌, బాహుబలి కట్టప్ప.. సత్యరాజ్‌ కరోనా మహమ్మారి బారీన పడ్డాడు. అయితే.. ఆయన పరిస్థితి విషమించడంతో… చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కరోనా చికిత్స పొందుతున్నారు.

ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో… అప్పి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్‌ లో ఉంటున్నాడు. కాగా.. గత రాత్రి ఆయన పరిస్థితి.. విషమించినట్లు సమాచారం అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపిస్తుంది. సామాన్యులే కాకుండా రాజకీయ నాయ‌కులు, సెల‌బ్రెటీలు ఇలా ఎలాంటి భేదాలు లేకుండా అంద‌రికీ క‌రోనా వైర‌స్ సోకుతుంది. టాలీవుడ్ లో చాలా మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. హీరో మ‌హేష్ బాబు, థమన, విశ్వక్‌ సేన్‌, మంచు ల‌క్ష్మీ, మీనా, త్రిషా తో పాటు చాలా మంది న‌టీన‌టుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news