మరో 27 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. GHMC, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్లో ఇప్పటికే 256 దవాఖానాల్లో వైద్య సేవలందుతున్నాయి. బస్తీ దవాఖానాల్లో 54 రకాల పరీక్షలు, పలు వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. భవనాల గుర్తింపు, సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది నియామకం తుది దశకు చేరుకుందని త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని అధికారులు చెప్పారు.