ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కలకలం.. 11 మంది వైద్యులకు పాజిటివ్

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. పేద నుంచి ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ కరోనా మహమ్మారి సోకుతుంది. అయితే… తాజాగా… ఉస్మానియా దవాఖానలో కలకలం రేపుతోంది. ఉస్మానియా దవాఖానాలో విధులు నిర్వహిస్తున్న 11 మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కొవిడ్ థర్డ్‌ వేవ్‌లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్‌లకు కరోనా లక్షణాలు కనిపించడంతో… వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ కరోనా పరీక్షల్లో ఏకంగా 11 మంది హౌస్ సర్జన్‌లకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారందరిని హోం ఐసోలేషన్‌ కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుటగానే ఉంది.

కాగా..తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. రోజుకు 2500 లకు పైగా కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. వీటికి తోడు… ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరిగి పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో… గత నెల చివరలో కరోనా ఆంక్షలను విధించింది కేసీఆర్‌ సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news