మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు…ఆపరేషన్ సక్సెస్…!

-

అమెరికాలోని వాషింగ్టన్ లో మొట్టమొదటిసారిగా వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. జెనెటికల్ మార్పులు చేసిన పంది గుండెను మనిషికి అమర్చగా ఆపరేషన్ విజయవంతం అయ్యింది. మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండగా అతడికి వైద్యులు జెనటికల్ మార్పులు చేసిన పంది గుండెను అమర్చారు.

శుక్రవారం రోజున వైద్యులు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు. ఇక ఆపరేషన్ తర్వాత రెండు రోజులు ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ లో ఉండగా ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా డాక్టర్లు అమర్చిన మంది గుండె సక్రమంగానే విధులు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే మనిషికి పంది గుండెను అవసరం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని భవిష్యత్తులో మరికొంతమంది ప్రాణాలు ఈ ఆపరేషన్ తో నిలబెట్టవచ్చు అని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news