యూపీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రచారం మునిగిపోతున్నాయి. అలాగే… ఇతర పార్టీల నేతలను లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అధికార బీజేపీ పార్టీ మాత్రం పార్టీ ఉన్న లీడర్లను కాపాడుకోవడమే కాకుండా.. కొత్త స్కీంలు అనౌన్స్ చేసుంది. ఇలాంటి తరుణంలో… కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీ కీలక ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో…. 125 మంది అభ్యర్థులతో జాబితా రెడీ చేసినట్లు చెప్పారు. 40 శాతం మహిళలు, 40 శాతం మంది యువతకు అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ. అంతేకాదు.. ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన చేశారు.125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌తో సహా 50 మంది మహిళలు ఉన్నారన్నారు.దీంతో యూపీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.