గుర్రం ఎక్కి సందడి చేసిన బాలయ్య..ఫోటోలు వైరల్

-

సంక్రాంతి పండుగ నేపథ్యంలో…హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలయ్య.. ఏపీలోని కారంచేడు కు మొన్న వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ కారంచేడులో సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బాలకృష్ణ.. భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి సందడి చేశారు.

అంతేకాదు…. సంక్రాంతి వేడుకల్లో కుమారుడు మోక్షజ్ఞ, బాలకృష్ణ గుర్రం ఎక్కి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరడంతో కారంచేడులో పండుగ వాతావరణం నెలకొంది. ఇక బాలకృష్ణ ను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు స్థానికులు. కాగా.. ఇటీవల బాలయ్య నటించిన అఖండ సినిమా బంపర్‌ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక… ఓవర్‌ సీస్‌ లోనూ అఖండ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. కాగా… ఈ సినిమా జనవరి 21 న హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news