బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ సమావేశం

ప్రధాని నరేంద్రమోదీ.. బీజేపీ కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈనెల 18న మోదీ, పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జనవరి 18వ తేదీ ఉదయం 11:00 గంటలకు జరుగుతుంది. ‘ మీ ఆలోచనలు మరియు సూచనలను పంచుకోండి. సలహాలను సూచనలను NAMO యాప్‌ను ద్వారా లేదా 1800 2090కి డయల్ చేయండి అంటూ భారతీయ జనతా పార్టీ, ఉత్తర ప్రదేశ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ఈరోజు ట్వీట్ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు ప్రధాని మోదీ, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలోని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గెలుపు కోసం కష్టపడాలంటూ ప్రధాని దిశా నిర్థేశం చేసే అవకాశం ఉంది.