దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కస్టమర్లకు ఆదేశాల్ని ఇచ్చింది. కస్టమర్స్ ని పాన్ కార్డు ని ఆధార్ కార్డు ని లింక్ చెయ్యమని చెప్పింది. ఒకవేళ కనుక కస్టమర్స్ లింక్ చెయ్యకపోతే బ్యాంకింగ్ సర్వీసులను ఆపివేస్తామని హెచ్చరించింది స్టేట్ బ్యాంక్. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
భవిష్యత్ నిరంతర బ్యాంకింగ్ సేవలు పొందేందుకు కస్టమర్లు ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసుకోవాలని బ్యాంక్ అంది. లింక్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని స్టేట్ బ్యాంక్ చెప్పింది. అలా అయితే ఎలాంటి లావాదేవీ చేసుకోవడానికి వీలుపడదు. పాన్, ఆధార్‌తో లింక్ చేసుకునే తుది గడువు మార్చి 31, 2022 వరకు ఉంది.
కనుక ఆలోగా లింక్ చేసుకోండి. అయితే లింక్ చేసుకోవాలంటే పెద్ద కష్టం ఏమి కాదు. 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకొచ్చు. UIDPAN టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్‌ను, 10 అంకెల పాన్ నెంబర్‌ను రాసి ఆ నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయాలి. ఇలా మీరు లింక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకొచ్చు. లేదు అంటే మీరు మరో పద్దతి కూడా వుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
లింక్ చేసుకోవాలంటే ముందుగా www.incometax.gov.inలోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు అక్కడ ఎడమ వైపు లింక్ ఆధార్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి
ఆధార్ నెంబర్ వాలిడేట్ కోసం అగ్రి మీద క్లిక్ చేయాలి.
www.incometax.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్, పాన్ లింక్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
పాన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయాలి. ఇక్కడ మీరు లింక్ అయ్యాయో లేదో చూడచ్చు.