చలికాలంలో డ్రై స్కిన్ వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. చలికాలంలో డ్రై స్కిన్ వాళ్లకు స్కిన్ డ్రై అయిపోవడంతో పాటుగా చాలా సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి దురదలు, చర్మం మంట కలగడం వంటివి కూడా కలుగుతూ ఉంటాయి. డ్రైస్కిన్ ఉన్నట్లయితే ఈ మార్పులు చేయండి. ఇలా చేయడం వలన స్కిన్ చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు. గోరువెచ్చని నీటితో మాత్రమే చలికాలం స్నానం చేయాలి.
డ్రై స్కిన్ ఉన్నట్లయితే వాతావరణ మార్పుల్ని తట్టుకోవడానికి డైలీ స్కిన్ కేర్ ప్రోటీన్ ని ఫాలో అవ్వండి. చలికాలంలో చర్మం డ్రై అవ్వకుండా ఉండడం ముఖ్యం. కాబట్టి హైడ్రేటింగ్ క్లెన్సర్ ని ఉపయోగించండి. అయితే ఎక్స్ ఫాలియేషన్ మాత్రం చెయ్యద్దు. ఎక్స్ ఫాలియేషన్ చేస్తే చర్మం సహజ ఆయిల్ ఉత్పత్తి కోల్పోతుంది. చాలా మంది స్నానం చేసిన తర్వాత టవల్ తో గట్టిగా రుద్దేస్తూ ఉంటారు.
అలా చేస్తే మాత్రం స్కిన్ చాలా డ్రై అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. పొడి చర్మం ఉన్నట్లయితే కలబంద గుజ్జుని ఉపయోగించండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇరిటేషన్ కూడా రాదు. అలాగే తేనె కూడా చర్మాని హైడ్రేట్ గా ఉంచుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు తేనెను అప్లై చేస్తే కూడా స్కిన్ బాగుంటుంది. కొబ్బరి నూనెని రాస్తే కూడా చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది. ఇలా వీటిని డ్రై స్కిన్ వాళ్ళు ఫాలో అయితే స్కిన్ చాలా బాగుంటుంది.