అరుదైన గౌరవం దక్కించుకున్న ‘జై భీమ్‌’..చరిత్రలోనే తొలిసారి

-

వినూత్న పాత్రలతో అలరించే నటుడు హీరో సూర్య. తనకు మంచి పాత్ర పడాలే కానీ.. తనలో ఉన్న నటనను బయటకు తీస్తాడు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ’జై భీమ్ ‘ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించాడు. ఈ మూవీపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. లాయర్ పాత్రలో సూర్య జీవించాడు. ఆడియన్స్ నుంచి సినిమాకు విశేష ఆదరణ లభించింది. టీజే జ్ఞానవేల్ డెరెక్షన్ లో సూర్య సతీమణి జ్యోతిక రూపొందిన జై భీమ్ సినిమాను పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ప్రశంసించారు.

అలాగే ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అయితే.. తాజాగా జై భీమ్‌ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అకాడమీ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఈ సినిమాకు సంబందించిన ఓ వీడియాను ఉంచారు. అకాడమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమా కు సంబంధించిన వీడియోను ఇంచటం ఇదే తొలిసారి. దీంతో చిత్ర బృందంతో పాటు.. సూర్య ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. జై భీమ్‌ ఇండియన్‌ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిందని ఎక్కించిందని వారు హర్షం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news