రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి KTR శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. మంత్రికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేలు పూల మొక్కలను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించి, అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి తదితరులు ఉన్నారు.