కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలలుగా హైడ్రా పేరుతో హంగామా చేసిందని బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీనగర్, జవహర్ నగర్ పేదలు 40 ఏళ్లుగా ఉన్నారు. మురికివాడల్లో ఉన్న వాళ్లు అక్రమంగా ఉన్న వాళ్లు కాదు.. 5,877 ఎకరాల భూమిని నాటి బ్రిటీష్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
బాలాజీ నగర్, జవహర్ నగర్ లోని భూమి రక్షణశాఖది.. అరుంధతినగర్ లో 1705 మందికి ప్రభుత్వమే భూమి ఇచ్చింది. కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికి అప్పుడు భూములు ఇచ్చారు. ప్రస్తుతం అరుంధతి నగర్ లో భూమాయ కొనసాగుతుంది. పేదలు కొని ఇల్లు నిర్మించుకుంటే ఈ ప్రభుత్వం కూల్చుతుంది” అని ఆరోపించారు ఈటల రాజేందర్.