ఇంటింటికి జ్వరం సర్వే మెదక్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబు, కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే ముందస్తు జాగ్రత్తలు సూచిస్తూ.. అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు పర్యవేక్షిస్తున్నారు.