వివిధ కారణాలతో బడికి దూరమైన 6-14, 15-19 ఏళ్ల వయస్సు గల పిల్లలను గుర్తించే సర్వే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని DEO బొల్లారం బిక్షపతి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 113 మంది సిఆర్పి, డిఎల్ఎంటి, ఐఇఆర్పిలు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వే ద్వారా బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి మాతృభాషలో విద్యను అభ్యసించే విధంగా వయసును బట్టి తరగతి గదిలో చేర్పించడం జరుగుతుందన్నారు.