సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు రాణించారు. దీంతో 287 గౌరవప్రదమైన స్కోరును నమోదు చేశారు. మొదట్లో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (55) తో పాటు శిఖర్ ధావన్ (29) రాణించారు. దీంతో మొదటి వికెట్ కు 63 పరుగుల భాగాస్వామ్యం దక్కింది. ఫస్ట్ డౌన్ కోహ్లి (0) డకౌట్ తో నిరాశ పరిచాడు. కానీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 71 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అంతే కాకుండా 10 ఫోర్లు, 2 సిక్స్ లను కూడా బాదాడు. దీంతో నాలుగో వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం టీమిండియాకు దక్కింది.
శ్రేయస్ అయ్యార్ నిరాశ పరిచినా.. వెంకటేష్ అయ్యార్ (22) పర్వలేదని అనిపించాడు. కాగ చివర్లో శార్ధూల్ ఠాకూర్ (40) తో పాటు రవి చంద్రన్ అశ్విన్ (25) పరుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది. కాగ సౌత్ ఆఫ్రికా నుంచి షమ్సీ 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే సిసంద మగల, మార్కామ్, కేశవ్ మహారాజ్, ఆండిలే ఫెహ్లుక్వాయో తలో ఒక వికెట్ తీసుకున్నారు. ఇదీల ఉండగా సౌతాఫ్రికా విజయం సాధించాలంటే.. 288 పరుగులు చేయాల్సి ఉంటుంది.