రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో RMP వైద్యులుగా పనిచేసే గజవెళ్లి శ్రీరాములు అనారోగ్యంతో మృతిచెందగా ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. మృతుడికి కొడుకులు లేనందున పెద్దకూతురు స్రవంతి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేసింది. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కూతుర్లు ఉండగా, పెద్ద కూతురే కొడుకులా బాధ్యత నిర్వహించి తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు.
వరంగల్ : రాయపర్తిలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
By Naga Babu
-