ఐఏఎస్ అధికారుల‌ రూల్ప్ మార్పున‌కు 9 రాష్ట్రాలు వ్య‌తిరేకం

-

దేశంలో ఉన్న ఐఏఎస్ అధికారుల నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ నిబంధ‌న‌ల‌ను 9 రాష్ట్రాలు వ్య‌తిరేకించాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలే ఐఏఎస్ అధికారుల నిబంధ‌న‌లను మార్చ‌డం స్పందించాయ‌ని తెలిపారు. అందులో 9 రాష్ట్రాలు దీనిని వ్య‌తిరేకించాయ‌ని తెలిపారు. అలాగే 8 రాష్ట్రాలు నిబంధ‌న‌లు మార్చడాన్ని స్వ‌గ‌తించాయ‌ని తెలిపారు. మిగితా రాష్ట్రాల‌కు కూడా ఈ స‌మాచారాన్ని మరోసారి చేర‌వేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

కాగ ఈ నిబంధ‌న‌ల‌ను మారిస్తే.. రాష్ట్రాల‌లో ఉండే ఐఏఎస్ ల‌పై బాధ్య‌త కేంద్రానికే ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐఏఎస్ అధికారి డిప్యుటేష‌న్ చేయాలంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రిగా ఉండేది. కానీ ఈ రూల్స్ మార్పు అయితే.. రాష్ట్రాన్ని సంప్ర‌దించ‌కుండానే ఐఏఎస్ అధికారుల‌ను డిప్యుటేష‌న్ కింద కేంద్రానికి తీసుకోవ‌చ్చు. అయితే ఈ రూల్స్ మార్చ‌డం వ‌ల్ల రాష్ట్రాలు హ‌క్కులు కోల్పోతాయ‌ని ప‌లు రాష్ట్రాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా కేంద్రం నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించింది. రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించేందుకే ఈ నిబంధ‌న‌ల‌ను మారుస్తున్నార‌ని సీఎం కేసీఆర్ పీఎం మోడీకి లేఖ కూడా రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news