కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు అయిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నోటిఫికేషన్ పరిధి అమలు పురోగతిపై నేడు కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ ప్రధాన కార్యదర్శి పంకజ్ కుమార్ నేడు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మెన్లు ఎంపీ సింగ్, చంద్ర శేఖర్ అయ్యర్ తోపాటు బోర్డు సభ్యులతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. కాగ బుధవారం రోజే రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం అయ్యారు. అయితే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ల పరిధిని కేంద్రం ఇటీవల ఖరారు చేసింది.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను గత ఏడాది జులై 15న విడుదల చేసింది. కాగ ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టొబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేసన్ లో ఉన్న ప్రాజెక్టులను ఈ రెండు బోర్డులు స్వాధీనం చేసుకోవాలి. అయతే ఇప్పటి వరకు ఈ రెండు బోర్డులు మొత్తం ఆరు రాష్ట్రాలలో ఒక్క ప్రాజెక్టును కూడా స్వాధీనం చేసుకోలేదు. అలాగే సీడ్ మనీ కింద తెలుగు రాష్ట్రాలు రూ.200 కోట్లను ఇవ్వాలి. కానీ ఇది కూడా జరగలేదు. అయితే నోటిఫికేషన్ అమలు తేదీ సమీపిస్తున్నా.. పనులు పూర్తికాకపోవడంతో నేడు జరిగే సమావేశం కీలకం కానుంది.