హైదరాబాద్ లో దారుణం.. కరోనా వచ్చిందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

-

చైనాలో పురుడు పోసుకున్న కలరా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలలకోసారి… తన రూపం మార్చుకుని ప్రజలపై పంజా విసురుతోంది ఈ మహమ్మారి. ఇక మన తెలంగాణ లోనూ… ఈ కాలం ఆ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇది ఇలా ఉండగా కరోనా సోకిందని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని… ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… అలేఖ్య అనే 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని భద్రాచలం జిల్లాకు చెందిన మహిళ. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావడంతో హైదరాబాద్లోని అల్వాల్ దగ్గర ఉన్న మానసరోవర్ హైట్స్ లో నివసిస్తోంది. అయితే ఈ నెల 21వ తేదీన.. అలేఖ్య తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలోనే ఆ యువతి కరోనా పరీక్షలు చేయించుకుంది.

ఈ పరీక్షల్లో అలేఖ్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా సోకడంతో ఆందోళనకు గురైన అలేఖ్య… ఆమె గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అలేఖ్య తల్లిదండ్రుల ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో… స్వయంగా వారు హైదరాబాద్ వచ్చారు. తీరా ఆమె ఫ్లాట్ డోర్ తీయగానే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news