ఇక 30 రోజులే… రీచార్జీల‌పై ట్రాయ్ కీల‌క ఆదేశాలు

-

దేశంలో ఉన్న అన్ని టెలికం కంపెనీల‌కు రీచార్జీల విషయంలో ట్రాయ్ కీలక ఆదేశాల‌ను జారీ చేసింది. మొబైల్ వినియోగ‌దారుల‌కు.. రీచార్జీల విషయంలో ఊర‌ట ఇచ్చే విధంగా టెలికం కంపెనీల‌కు ట్రాయ్ ఆదేశాల‌ను జారీ చేసింది. రీచార్జీల విషయంలో 28 రోజులే నెల‌గా ఎలా ప‌రిగ‌ణిస్తార‌ని టెలికం కంపెనీల‌ను ట్రాయ్ ప్ర‌శ్నించింది. 30 రోజుల వ్యాల‌డిటీ ఉండే విధంగా రీచార్జీ ప్లాన్స్ అందుబాటు లోకి తీసుకురావాల‌ని టెలికం కంపెనీల‌ను ఆదేశించింది. అన్ని టెలికం కంపెనీల రీచార్జీ ప్లాన్స్ 28 రోజుల వ్యాల‌డిటీతోనే ఉన్నాయ‌ని ట్రాయ్ అంది.

అయితే క‌నీసం ఒక్క ప్లాన్ అయినా.. 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకురావాల‌ని ఆదేశించింది. కాగ ప్ర‌స్తుతం దేశంలో ఉన్న జీయో, ఎయిర్ టెల్, వీఐ తో పాటు ఇత‌ర టెలికం కంపెనీలు రీచార్జ్ వ్యాలిడిటీని 28 రోజుల‌కు గానే నెల‌గా చెబుతూ ప్లాన్స్ ఇస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికి చాలా మంది వినియోగ‌దారులు ట్రాయ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో టెలికం కంపెనీల‌పై ట్రాయ్ సీరియ‌స్ అయింది. 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్స్ నూ అందుబాటులోకి తీసుకురావాల‌ని టెలికం కంపెనీల‌కు ట్రాయ్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news