ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఐరోపా ఖండంలోని ఇంగ్లాండ్ దేశం గురువారం కరోనా పై సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా అంటే సాధారణ ఫ్లూ గానే తాము భావిస్తున్నామని ఇంగ్లాండ్ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆందోళన పడదని తెల్చి చెప్పారు. అంతే కాకుండా దేశంలో కరోనా ఆంక్షలను అన్నింటినీ కూడా ఎత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ లో మాస్క్ తప్పని సరి కాదు, అలాగే భౌతిక దూరం వంటి ఆంక్షలు ఎవీ కూడా అమలులో ఉండవని తెలిపారు.
అలాగే శుభ కార్యాలు, రెస్టారెంట్లు, పబ్ లు, క్లబులు అన్నింటికీ పూర్తి స్థాయి అనుమతులను ఇచ్చారు. ప్రజలు కరోనా తో కలిసి సహజీవనం చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ ఎన్ని నిబంధనలు పాటించినా.. దూరం కాదని వివరించారు. అందుకే కరోనా వైరస్ పై తమ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాలికలను సిద్ధం చేసుకున్నట్టు ఇంగ్లాండ్ ప్రభుత్వం వర్గాలు తెలిపారు. అయితే ప్రజలు అందరూ కూడా వ్యాక్సిన్లు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు.