స్టార్ హీరో విజయ్ కు చెన్నై హై కోర్టులో ఊరట లభించింది. హీరో విజయ్ ఇటీవల విదేశాల నుంచి ఖదీదైనా కారు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఖరీదైనా కారుకు హీరో విజయ్ ఎంట్రీ ట్యాక్స్ కట్టలేదు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ చెన్నై హై కోర్టులో హీరో విజయ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై హై కోర్టు లో వాణిజ్య పన్నుల శాఖ వేసిన పిటిషన్ గతంలో విచారించారు. ఈ విచారణ లో హీరో విజయ్ పై మద్రాస్ హై కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసింది.
సమాజంలో గౌరవంగా బతికే విజయ్.. ఎంట్రీ ట్యాక్స్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించింది. ఇలా పన్ను ఎగవేతకు పాల్పడటం సరైంది కాదని మద్రాస్ హై కోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా విజయ్ కొనుగోలు చేసిన ఖరీదైనా కారుకు తప్పని సరిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ విచారణ ముగిసి చాలా కాలం అయినా.. మళ్లి తెర పైకి వచ్చింది.
ఈ విచారణ సమయంలో తన పై వ్యక్తిగతంగా ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలని విజయ్ మాద్రాస్ హై కోర్టు ను ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే హీరో విజయ్ పై ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని హై కోర్టు ఆదేశించింది. కాగ ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.