కాంగ్రెస్ అధినేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యలన వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రధానంగా సిక్కులపై, రిజర్వేషన్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సైతం సోనియాగాంధీ నివాసం ముందు నిరసన తెలిపాయి.
ఇదిలా ఉంటే.. అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తొలిసారిగా మౌనం వీడారు రాహుల్ గాంధీ. బీజేపీ అబద్దాలను చెబుతుందని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యలో ఏదైనా తప్పు ఉందా..? అని ప్రశ్నించారు రాహుల్ గాందీ. భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడిని, సోదరిమణులను అడగాలనుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా..? భారత్ లో ప్రతీ సిక్కు లేదా ప్రతీ భారతీయుడు తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశంగా ఉందా..? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ.