BREAKING : “కరీంనగర్ కారు ప్రమాదం” ఘటనలో స్కూల్ విద్యార్థులు ముగ్గురు అరెస్ట్

-

కరీంనగర్ జిల్లా : కమాన్ కారు ప్రమాదం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సిపి సత్యనారాయణ మాట్లాడుతూ.. కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వాకమేనని.. కారు డ్రైవ్ చేసింది మైనర్ బాలుడు అతనితో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెప్పారు. కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్ కొడుకే ప్రధాన నిందితుడు అని.. మైనర్ తొమ్మిదోవ తరగతి చదువుతున్నాడని చెప్పారు.

మరో ఇద్దరు మైనర్లు పదవ తరగతి చదువుతున్నారని.. చెప్పారు. వ్యవసాయ ఆధార పనిముట్లు చేస్తున్న వీధి వ్యాపారులపై అతివేగంతో కారు వెళ్ళిందని.. ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారన్నారు. తండ్రి రాజేంద్రప్రసాద్ తానే డ్రైవ్ చేసినట్టు నమ్మబలికే ప్రయత్నం చేసాడు.. విచారణలో మైనర్ బాలుడే నిందితుడుగా తేలిందని చెప్పారు.

కారు కొడుక్కి ఇచ్చిన రాజేంద్రప్రసాద్ పై మైనర్ బాలురుపై కేసులు నమోదు చేశామని.. దట్టమైన పొగ కారణంగా నియంత్రణ కోల్పోయినట్లు కారులో ఉన్న మైనర్లు విచారణలో తెలిపారని వెల్లడించారు.
బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ నొక్కడంతో ప్రమాదం జరిగిందన్నారు. వీరిని త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news