ఈ అదిరే ఐడియాని ఫాలో అయితే నెలకు రూ.60 వేలు..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలు కంటే కూడా బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? అదనంగా ఆదాయాన్ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక బిజినెస్ ఐడియా. ఈ విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా నెలకి అరవై వేల వరకు సంపాదించుకోవచ్చు. బయట ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అవకాశాన్ని ఇస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ ఎటిఎం బ్రాంచ్ ఫ్రాంచైజ్ ని తీసుకోవడం ద్వారా మీరు ఈ డబ్బులు సంపాదించుకోవచ్చు.

 

బ్యాంకు లో నేరుగా ఏటీఎం ని ఇన్స్టాల్ చేయవు కానీ బ్యాంకు తరఫున కొన్ని కంపెనీలు పెడతాయి. ఇలా మీరు ఫ్రాంచైజ్ ని తీసుకుని మంచిగా సంపాదించుకోవడానికి అవుతుంది. 50 నుండి 80 చదరపు అడుగుల స్థలం దీనికి కావాలి. ఈ స్పేస్ మరో ఎటిఎం కి వంద మీటర్ల దూరంలో ఉండి తీరాలి. 300 ట్రాన్సాక్షన్స్ ఎటిఎం చేయగలగాలి. 24 గంటల పాటు పవర్ సప్లై ఉండాలి. దీనిని కనుక మీరు మొదలు పెట్టాలంటే ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అవసరమౌతాయి.

జీఎస్టీ నెంబర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు కావాలి. ఇక వీటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే… టాటా ఇండికా వంటి కంపెనీలు దేశంలో ఏటీఎంలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ కంపెనీల వెబ్ సైట్ ద్వారా మీరు ఫ్రాంచైజ్ ని తీసుకోవడం కోసం దరఖాస్తు చేయొచ్చు. ఎటిఎం ద్వారా ప్రతి రోజూ 250 ట్రాన్సాక్షన్స్ జరిగితే.. 65 శాతం నగదు 35 శాతం నగదు రహిత లావాదేవీలు ఉంటే నెలసరి ఆదాయం 45 వేల వరకు ఉంటుంది. అదే 500 ట్రాన్సాక్షన్లు జరిగితే 90 వేల వరకు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news