తెలంగాణలో 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీచేసింది. బదిలీల్లో భాగంగా… సిద్ధపేట కలెక్టర్ గా కృష్ణ భాస్కర్, ఖమ్మం కలెక్టర్ గా ఆర్ వీ కర్ణన్, భూపాల పల్లి కలెక్టరుగా వెంకటేశ్వర్లు, ఆసీఫాబాద్ కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హన్మంతు, సంగారెడ్డి కలెక్టరుగా హనుమంతరావు, హైదరాబాద్ కలెక్టరుగా రఘునందన్ రావు, రంగారెడ్డి కలెక్టర్ గా లోకేష్ కుమార్, రాజన్న సిరిసిల్ల కు వెంకట్రామిరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం అయోమ కుమార్, వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ యోగితా రాణాలను నియమించింది. ముందస్తు ఎన్నికల్లో భాగంగానే ప్రభుత్వం కలెక్టర్ల బదిలీలను చేపట్టిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.