ముస్లిం మైనార్టీలకు సీఎం వరాల జల్లు..

-

 ‘నారా హమారా..టీడీపీ హమారా’లో  చంద్రబాబు హామీలు

గుంటూరులో  ‘నారా హమారా..టీడీపీ హమారా’ పేరుతో మైనార్జీ మహా సదస్సును తెదేపా  నిర్వహించింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు వరాల జల్లు కురిపించారు. తెదేపా నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…మూడు వేలకంటే ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో ఖాజీ ఏర్పాటు చేస్తాం.. దర్గాల కోసం రూ. 10 కోట్లు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు సాధించే బాధ్యతను తెదేపా ప్రభుత్వం తీసుకుంటోందని హామి ఇచ్చారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ లు నిర్మాణం, మైనార్టీలకు అదనంగా 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ముస్లింలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని…హామీల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news