తెలుగు రాష్ట్రాల్లో న్యాయాధికారుల విభజనపై సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ బుధవారం నాటికి వాయిదా పడింది. మంగళవారం సుప్రీం కోర్టులో విభజనకు సంబంధించి సుదీర్ఘ వాదనలు జరిగాయి.. అనుభవం ఆధారంగా విభజన చేస్తే తెలంగాణ కి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరుఫు సల్మాన్ ఖుర్షి, అహ్మద్ లు వాదనలు వినిపించారు. దాదాపు గంటకు పైగా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారం (రేపటి) కి వాయిదా వేసింది. న్యాయాధికారుల విభజనపై హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పై తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీంని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. కేంద్ర కూడా హైకోర్టు విభజనకు సమ్మతి తెలిపిన నేపథ్యంలో సుప్రీం తీర్పు కీలకంగా మారనుంది.