ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీకి చెందిన గరుడ ప్లస్ బస్సుల ప్రయాణ ఛార్జీలు తగ్గిస్తున్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఎంతో విలాసంగా ఉండే ఏసీ గరుడ ప్లస్ బస్సు ఛార్జీలను రాజధాని బస్సు ఛార్జీలకు సమానంగా చేశారు. కాగ సంస్థ అభివృద్ధికి పలువురు ఇచ్చిన సలహాల ఆదరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎండీ సజ్జనార్ అన్నారు. కాగ ఇప్పటి వరకు ఛార్జీలు పెంచడమే కానీ.. తగ్గించింది చాలా అరుదు.
కానీ ఆర్టీసీ సంస్థ అభివృద్ధి చెందడానికి, ప్రజల ఆదరణ పెరగడానికి గరుడ ప్లస్ బస్సుల ఛార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ అభివృద్ధి చెందాలంటే.. ఛార్జీలు పెంచేవారు. కానీ ఫస్ట్ టైమ్ ఆర్టీసీకి ప్రజల ఆదరణ పెరగడానికి ఛార్జీలు తగ్గించారు. అయితే సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సంస్థను నష్టాల నుంచి గట్టేక్కించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రజలను ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి వినూత్నం గా ప్రచారం కూడా చేస్తున్నారు.