నేడు జ‌న‌గామ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జ‌న‌గామ జిల్లాలోని స‌మీకృత జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నంతో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యాన్ని కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభిస్తారు. అనంత‌రం స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగిస్తారు. కాగ మూడు సంవ‌త్స‌రాల క్రితం జిల్లా కలెక్ట‌రేట్ శంకుస్థాప‌న చేశారు. సూర్య‌పేట్ రోడుకు దాదాపు 25 ఎక‌రాల్లో క‌లెక్ట‌రేట్ ను నిర్మించారు. రూ. 32 కోట్ల బ‌డ్జెట్ తో మూడు అంత‌స్తుల్లో క‌లెక్ట‌రేట్ ను నిర్మించారు.

మొత్తం 34 శాఖ‌లు ఒకే బిల్డింగ్ ఉండేలా ఈ భ‌వ‌నాన్ని నిర్మించారు. ఈ క‌లెక్ట‌రేట్ ను ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. అయితే సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జ‌న‌గామ జిల్లా గులాబీమ‌యం అయింది. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ కేసీఆర్ ప‌ర్య‌ట‌న కోసం ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ పాల్గొనబోయే స‌భ ఏర్పాట్ల‌ను కూడా టీఆర్ఎస్ నాయ‌కులు భారీ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ స‌భ‌కు ఏకంగా 1,30,000 మందిని త‌ర‌లించాల‌ని టీఆర్ఎస్ నాయ‌కులు సిద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news