దీపికా సినిమాపై కంగనా రనౌత్ ఫైర్… చెత్త సినిమా అంటూ కామెంట్స్

-

దీపికా పదుకొనే, సిద్దాంత్ చతుర్వేది కలిసి నటిస్తున్న రోమాంటిక్ లవ్ డ్రామా ‘ గెహ్రైయాన్’. ఈ సినిమా ఈనెల 11 నుంచి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అనన్య పాండే, ధైర్య కర్వా, నసీరుద్దీన్ షా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో దీపికా, సిద్ధాంత్ మధ్య ఘాటైన రొమాన్స్ సీన్లు ఉన్నాయి. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో సెగలు పుట్టిస్తోంది ఈ జంట. ఇదిలా ఉంటే ఈ సినిమాపై నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. దీపికా పదుకొనేని ట్రోల్ చేస్తున్నారు. మీరు .. ఈ సినిమా చేయడానికి మీ భర్త రణ్ వీర్ సింగ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా..? అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ కూడా దీపికా గ్రెహ్రైయాన్ సినిమాపై కామెంట్లు చేసింది. ఈసినిమా చెత్త సినిమా అంటూ కామెంట్లు చేసింది. నేను కూడా ఈ మిలీనియం వ్యక్తినే.. ఈ రకమైన వాటిని గుర్తించి అర్థం చేసుకోగలను. న్యూఏజ్, అర్బన్ సినిమాల పేరుతో ఈ రకమైన చెత్తను అమ్ముకోవద్దు, చెడ్డ సినిమాలను, చెడ్డ సినిమాలుగానే చూడాలి. స్కిన్ షో, అశ్లీలత సినిమాను కాపాడవు అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news