SarkaruVaariPaata : “సర్కారు వారి పాట” నుంచి కళావతి సాంగ్‌ రిలీజ్‌

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది.ఈ సినిమాలోని మొదటి పాటను లవర్స్‌ డే ఉన్న నేపథ్యంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు ఇవాళ సాంగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో మహేష్‌ బాబు చాలా హ్యండ్‌ సమ్‌ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ పాటలో మహేష్, కీర్తి మధ్య కెమిస్త్రీ బాగ్ వర్క్ అవుట్ అయింది. కాగా ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news