మత్స్యకార్మికులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బహరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీకి అధికారం ఇచ్చింది.. మటన్, చికెన్, చేపలు అమ్ముకోవడానికా.. అంటూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పై తీవ్రంగా మండి పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వానికి.. నిధులుపై ఉన్న ప్రేమ ప్రజల పై లేదని విరుచుకు పడ్డారు.
అలాగే జగన్ కు ఈగో ఎక్కువ అని అన్నారు. ఎంత పెద్ద వాళ్లు అయినా జగన్ వద్దకు వస్తే.. సర్ అనే పిలవాలట.. అని అన్నారు. వైసీపీ నాయకులు ఏమైనా.. పై నుంచి దిగి వచ్చారా.. అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా.. ఫ్యూడలిజమా అని మండి పడ్డారు. అలాగే రాష్ట్ర ప్రజలు.. ఈ ఒక్క ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్ర ప్రజల కోసం ప్రాణం ఇస్తానని అన్నారు.