వావ్‌.. మ‌తి పోగొడుతున్న ‘గాంధారి’ సాంగ్

-

మ‌హాన‌టి కీర్తి సురేష్ ప్రస్తుతం వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. సోలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ చేసిన ప్ర‌తి సినిమా బోల్తా కొడుతూనే ఉంది. పెంగ్విన్‌, మిస్ ఇండియా, గుడ్‌ల‌క్, స‌ఖి ఇలా ప్ర‌తి సినిమా మిశ్ర‌మ ఫ‌లితాన్నే ఇచ్చింది. కానీ కీర్తి సురేష్ న‌ట‌నకు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

తాజాగా కీర్తి సురేష్ గాంధారి అనే ఒక మ్యూజిక్ వీడియో ఆల్బ‌మ్‌లో న‌టించింది. ఈ గాంధారి మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను ది రూట్‌, సోని మ్యూజిక్ సౌత్ సంస్థ‌లు నిర్మించాయి. గాంధారి టైటిల్ క్యారెక్ట‌ర్ లో కీర్తి సురేష్ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ పాట‌కు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించ‌గా.. ల‌వ్‌స్టోరీ సినిమా సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. అన‌న్య భ‌ట్ ఈ పాట‌ను పాడారు. ఈ ఆల్బ‌మ్‌ను ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల చేయ‌గా.. విడుద‌లైన కొద్ది క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారింది. ఇప్పుడూ సోష‌ల్ మీడియా ఈ సాంగ్ హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది.

గాంధారి ఆల్భ‌మ్ కేవ‌లం రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశార‌ట‌ గ‌తంలో బృందా మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫి చేసిన పాట‌ల్లో నేను డ్యాన్స్ చేశాను. సారంగ ద‌రియా పాట త‌రువాత గాంధారి పాట‌తో సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ మ‌రొక హిట్ అందుకున్నారు. కేవ‌లం రెండు రోజుల్లోనే ఇంత మంచి సాంగ్‌ను షూట్ చేశారా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news