కాకినాడలో APPle కంపెనీపై భారీ ఫైన్ పడింది. కస్టమర్ ని మోసగించినందుకు యాపిల్ కి 1,29,900 జరిమానా విధించింది కాకినాడ వినియోగదారుల ఫోరం. 85,900 తో అక్టోబర్ 13 2021 న యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేశారు కాకినాడకు చెందిన పద్మరాజు. ఈ తరుణంలోనే ఐ ఫోన్ కి 14900 ఎయిర్ పాడ్స్ ను ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించింది APPle కంపెనీ.
అయితే.. దీనిపై యాపిల్ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు సరిగా స్పందించకపోవడంతో 2022 ఫిబ్రవరి 15 కాకినాడ వినియోగదారుల పోరమ్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కస్టమర్ ని మోసగించినందుకు యాపిల్ కి 1,29,900 జరిమానా విధించింది కాకినాడ వినియోగదారుల ఫోరం. ఎయిర్ పాడ్స్ కి 14900, మానసిక క్షోభకు 10000, కోర్టు ఖర్చు లకు 5000 పద్మరాజుకు చెల్లించాలని యాపిల్ ను ఆదేశించింది కమిషన్. సీఎం సహాయ నిధి కి లక్ష రూపాయలు చెల్లించాలని యాపిల్ కి జరిమానా విధిస్తు ఆదేశాలు ఇచ్చింది.