అమ్మా, నాన్నా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఉక్రెయిన్ సైనికుడి ఆఖరి మెసేజ్..!

-

ఈ సైనికుడి ఆఖరి వీడియో చూస్తే మనసు ముక్కలై పోతుంది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. అయితే ఒక సైనికుడు తన తల్లిదండ్రుల కి గుడ్ బై చెప్పి ఒక వీడియో ని రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్మీ యూనిఫామ్ తో అతను ఈ వీడియోని రికార్డ్ చేశాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇప్పటికీ 137 మంది సైనికులు చనిపోయినట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా వరకు సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.

అయితే సామాన్య ప్రజానీకంపై దాడి చేయడం లేదని అంది. రష్యా ఇలా ఉండడం తో ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ఈ దేశం పై మండి పడుతున్నారు. అలానే వీటిని ఆపాలని కూడా చెబుతున్నారు. అయితే రష్యా గురించి నాటో తీవ్రంగానే స్పందించింది. ఇలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని నాటో దేశాలు రష్యా ని హెచ్చరించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news