బీఆర్ఎస్ వల్లే వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి : మాజీ మంత్రి నిరంజన్

-

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే నేడు వ్యవసాయరంగంలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు నీటిని నిల్వ ఉంచే ప్రయత్నాలు చేయలేదన్నారు.తెలంగాణ నీటి పారుదల వ్యవస్థను సమైక్య పాలకులు విధ్వంసం చేశారు.ఇది ఉద్దేశపూర్వకమైన కుట్ర.సాగునీరు లేక విధిలేని పరిస్థితిలో రైతులు వలసలు పోయారు.మరికొందరు కరువుతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ ద్వారా నీటిని నిల్వ చేసే ప్రయత్నాలు చేశాం.

కాళేశ్వరాన్ని పూర్తి చేశాం. దాదాపు 1000 చెక్ డ్యాంలు నిర్మించాం. గత BRS ప్రభుత్వ చర్యల వల్లనే దేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేయకపోవడం వల్ల 12,500 లక్షల ఎకరాలకు నీళ్లు అందడం లేదు. ముచ్చర్ల దగ్గర ఉన్న సుమారు 14 వేల ఎకరాలలో ఫార్మా సిటీ నిర్మించకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలు చేస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ కడతామంటూ అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టి, పోలీసుల చేత హింసించి బలవంతంగా భూములు లాక్కోవడం మూర్ఖపు చర్య. అటు పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టి.ఇక్కడ కొడంగల్‌లో ఫార్మా సిటీ కోసం నీళ్లను దోచుకుంటున్నారని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news